తీరైన స్వప్నం
తీరైన స్వప్నం


ప౹౹
అరే ఏమయ్యిందీ ఆ మనసుకే తెలియనిది
సరి చెయ్యనూ ఏముంది తాను కలయనిది |2|
చ|౹
ఆనాడు అనుకోని అపురూప స్వప్నదర్శనం
జాడే కనలేని ఈ ఎదురుచూపులే నిదర్శనం |2|
కలయని కలయనిదనీ ఆ కళ్ళకేల తెలుసని
చూసి చూసి అలసినా మనసుకేలా అలసని |ప|
చ||
ఆ స్వప్నమేల అందక పోయేను అదనే తప్పి
మది మేళమే వేళే మరచి కాదనక తనే చెప్పి
నాటి వనమున నాటిన నవనమును మరచి
నేటికైన నిజము తెలుపు నీమనసునే తెరచి |ప|
చ||
ఎన్నాళ్ళీ మదనం మదిలోని మాటనే తెలుప
కొంచెమైనా తెగువ చూపవా నీ కళ్ళనే కలుప|2|
కాని తన మేమున్నదీ ప్రేమించనూ మనసారా
జాణతనమే వదలి చూపించై వలపుకే ఆసరా |ప|
చ౹౹
తీరైన స్వప్నం తీరుగా కలిగించెనే రమణీయం
తిరుగులేని ఆ హాయి కూడ ఎంత కమనీయం ౹2౹
మనసులోని సంరంభం మరి కదిలే వేడుకలా
వరుసలోని వలపే కాదంటే కాదా ఓ పీడకలా ౹ప౹