అందుకో
అందుకో


ప౹౹
అందుకోవా ఈ లేఖతో అందమైన ఊహలు
పొందనీ అనుభూతిని చెప్పకనే గుసగుసలు ౹2౹
చ౹౹
ఏకాంతాన్నీ ఎగరేసుకొని ఎచటికో చేరునులే
ఆసాంతం హర్షంతో మది నదిగా మారునులే ౹2౹
కోరికనే కోరకనే కొత్తఆశలే కొంగుబంగారంలా
ఊరకనే ఉరికినే ఎదలోని మైకం సింగారంలా ౹ప౹
చ౹౹
లేఖలోని అక్షరాలు సువర్ణాక్షరాలై స్పురించగ
శాఖలై గాలి గంధం అణుఅణువు విస్తరించిగ ౹2౹
చేరిన ఉత్తరమే ఊసుల చందనాలే చల్లునని
మారని మనసు మార్చు బంధనాలే చెల్లునని ౹ప౹
చ౹౹
చదువు ఈ ఉత్తరాన్ని సాంతంఏకాంతంలోనే
మధువులా మత్తునే పంచు ఆప్రశాంతంలోనే ౹2౹
విహరించు ఊహాలోకంలో ఆ పదాల ప్రాసతో
వివరించాక బహు వివరంగా అదనపుఆశతో ౹ప౹