వేశ్య
వేశ్య


వెలయాలువా స్త్రీ గతిని ప్రశ్నించే ఎదురీతవా?
గమ్యం లేని పయనానివా?
మాటేరాని మౌనానివా?
తడియారని కనురెప్పల్ని భారంగా మోసేటి వెధనవా?
మాదపుటనుగులచే మసిబారిన చంద్రికవా?
బలహీనతకు బలమైన సాక్ష్యానివా?
నిరీక్షణకు నిలువుటద్దంవా?
పరిమళాన్ని అణగదొక్కిన రాతిపువ్వువా?
అన్యాయాన్ని అత్యాచారాన్ని ముద్దాడిన ముద్దాపూబంతివా?
ఓ తరుణిమణీ,
నీ కన్నీటి కడవలు అలలను ఉప్పెనలా మార్చాయి..
నీ గతాన్ని శూన్యంలోకి నెట్టి ..
నీ జీవిత గమనం లో ఎన్నో నిద్రలేని రాత్రుల్లో
నీలి నీడలు కమ్ముకున్నాయి.
ఎన్ని ఉదయాలైన నీ ముంగిట
వెలుగు నింపలేకపోయాయి..
భాషే లేని కన్నీరుని,
కనుపాపలతో కప్పి,
నీ దేహాన్ని దానవులకి అర్పిస్తున్నావా?
మానవత్వం పరిమళించని చోట
బందీవైన బంధినివా?
కన్నీటి జల్లుకు నాట్యమాడే ఓ నాట్య మయూరి.....
నీవు కన్న కన్నె కలలు
కన్నీటి వానలో కొట్టుకుపోగా,
చెలిమి చేసే రేయి కూడా
రాయిలా నిన్ను మార్చిపోగా,
వెలుగునివ్వని ఉదయం
నిన్ను వెక్కిరిస్తు నవ్వగా,
నీ ఆశలకు నీవే సమాధి కట్టుకున్నావా?
సూతిమెత్తని నీ మదిలో మొరటుదనాన్ని నింపుకున్నావా???