లేఖావళి
లేఖావళి


ప౹౹
నిండైన ఉత్తరం రాస్తున్నా ఉండబట్టలేక
గుండె సవ్వడే నీతో ఎదురుగా చెప్పలేక ౹2౹
చ౹౹
కనుగొన్నాను మనసులో ఆ విషయము
అనుకున్నానూ నిర్ణయించీ సమయము
ఉత్తరమంటే ఉత్త ఊసులే కాదుగా మరి
చిత్రమైన ఊహలు చిలిపిగా ఎదను చేరి ౹2౹
చ౹౹
అక్షరాలనే పేర్చా అందమైన పూరెమ్మలా
నక్షత్రాల్లా వరసజేరిన వెలుగుల కొమ్మలా ౹2౹
చదువుకున్నాకే చక్కగా మది నిండును
మదువు గ్రోలినట్లే మైకముతో ఉండును ౹ప౹
చ౹౹
కొత్తగా చెప్పినా సరే రేపటికది పాతదేగా
మెత్తగా చెప్పనా మేనుమెచ్చ నింపాదిగా ౹2౹
హృదయము పూలవనమల్లే రవళించగా
ప్రతి ఉదయమూ ఒక లేఖై ముకుళించగా ౹ప౹