వలపు దాహం
వలపు దాహం
ప౹౹
ఎన్ని దారులనో నడవాలి ఎడారిని దాటేందుకు
కొన్ని కలలైన కనాలి ఎదనే ప్రేమగ మీటేందుకు|2|
చ||
రేపు కూడా నిన్నేలే ఎంచిచూసిన ఆ ఎల్లుండికి
ప్రేమలో తావు లేదులే ఎన్నడూ మరి మొండికి|2|
వాయిదాలు చెప్పక వచ్చి నిలుపు నీ మర్యాదే
ఖాయిలాలేని వలపే నీదని తొలగించు ఫిర్యాదే|ప|
చ||
వలపు గుర్రం ఎక్కాకను తానలపునే ఎరుగునే
తలపు స్వర్గం తలుపు తొలగి మైకం పెరుగునే|2|
ఎన్నాళ్ళీ ఈ తీయని బాధ తీర్చగా నీవు రావా
కన్నీళ్ళే కనపడని మదనమే ముదమునే తేవా|ప|
చ||
మనసులో యోచనే ప్రేమ యాచన మరి కోరద
వయసుతో పెరిగే ఆ కోరికేదో ఇప్పుడైనా తీరద|2|
వేసారిన మదిలో ఎండమావిని ఇక తొలగించు
కాసారంతో ఎదలు కలుప జాగేలనో కౌగలించు|ప|
చ౹౹
సహనం దాటినదా ఇక మిగిలేది నా అహమేగా
అసహనం తోటి కోల్పోయిది వలపు దాహమేగా ౹2౹
వచ్చి వలపు సేద్యమే చేసి ఎదలో పండించవా
నచ్చి నవపారిజాతమై నాఅహం తొలగించవా ౹ప౹