లేఖ ఒకటి...
లేఖ ఒకటి...


ప౹౹
రాకరాక వచ్చినే మరుల మందహాసం
లేక లేక రాస్తున్నా లేఖ ఒకటి నీ కోసం౹2౹
చ౹౹
గడిచిన ఋతువులో గడిపిన క్షణాలు
తొడిగిన ప్రేమ క్రతువు సరసలక్షణాలు ౹ప౹
ఎలమి హారతులే ఎదలోకి చూస్తున్నా
చెలిమి గురుతులే చెప్పలేక రాస్తున్నా ౹2౹
చ౹౹
మాటేసి మనసులో గూఢమైన నిజాన్నీ
మాటిమాటికీ ఎదలో ఎగసే ఉత్తేజాన్నీ ౹2౹
సాధించి సమయానికి ఒకటి చేసి అలా
వేధించే ఎదనే ఊరడించానే రాసి ఇలా ౹ప౹
చ౹౹
ఊరికే రాశానని ఊకొట్టి ఊరుకోవద్దూ
ఊరించే ఊసులతోను ఉక్కిరైపోవద్దూ ౹2౹
రాక వచ్చిన లేఖతో లెఖ్ఖించై వలపును
రాకపోకలకై తెరచై మనసు తలుపును ౹ప౹