ఊహలకే
ఊహలకే


ప౹౹
పెదవి కావాలని అడుగునా తేనే కావాలని
పొదివి పట్టి ఆ మధురిమనే తనే తేవాలని ౹2౹
చ౹౹
ఊహలూ రెక్కలనే మొలపించి మోహించే
దాహాలూ ఒక్కటిగ దేహమంత ప్రవహించే ౹2౹
ఆ తమకం తాను అణువణవు ఆవహించే
ఏ మైకమో మనసులోను కలచి కలహించే ౹ప౹
చ౹౹
ఏపాటిదో తీవ్రత కొలిచి ఎలా వివరించను
ఈనాటిదా ఆకోరిక మరలా వ్యక్తీకరించను ౹2౹
ఆమనే అర్థం చేసుకొని మళ్ళీఆదరించదా
ఆమెనే ముందుకువచ్చి తనే కనికరించదా ౹ప౹
చ౹౹
తలపుల తన్మయాన్ని తనువుతో పెనవేసి
వలపుల వదనాన్నీ తానే కాకి ఎంగిలి చేసి ౹2౹
పొందాకా ఆ అధరం కోరునే తరచి తరచి
అందాకా ఆగుమా అదను కోసం వేచి వేచి ౹ప౹