దరిచేరవా
దరిచేరవా


ప౹౹
దరిచేరవా దరహాసం నిండిన మోవితో
సరిచేయవా సరసం పండించి ఈవితో ౹2౹
చ౹౹
కోరికేమో కొండెక్కి కొరికేస్తుందీ ఇచ్చతో
మరింకేమో మారాము చేయకే కచ్చతో ౹2౹
మొన్న చెప్పిన ఊసులు మరువలేదూ
నిన్న చేసిన బాసలు నిలువరించలేదూ ౹ప౹
చ౹౹
ఎందుకే ఎదనూ దాచేసి వెక్కిరింతలూ
అందుకేన అదుపులేని మిణకరింతలు ౹2౹
కొంటె కోణంగి కొలతలేని ఆ ఆరాటమే
కంటి కొలికిలోనా కనిపించే కోలాటమే ౹ప౹
చ౹౹
కదలి వచ్చి కలహంసలా కలవరించకే
మెదలి మనసులో అలా పలవరించకే ౹2౹
భావాలే బాణాలై గుచ్చి గుచ్చి పోవునే
అనుభవాలే గిచ్చిగిచ్చి ఉండు కావునే ౹ప౹