Exclusive FREE session on RIG VEDA for you, Register now!
Exclusive FREE session on RIG VEDA for you, Register now!

Ramesh Babu Kommineni

Romance


4.8  

Ramesh Babu Kommineni

Romance


శుభలేఖ

శుభలేఖ

1 min 353 1 min 353

ప౹౹

శుభలేఖ తెచ్చా గాలి పరిమళం కలిపి

శుభాకాంక్షలు చెప్పేందుకు నీకు తెలిపి ౹2౹


చ౹౹

అందమైన ఆకృతిలా చెక్కి చెక్కీ రాశా

విందులా కనులకే కనిపించాలని చేసా ౹2౹

ఒకసారి చూసి ఓరచూపు ఒలికించవా

ఈసారైన ఓ పలుకే మారే పలికించవా ౹ప౹


చ౹౹

దారి కాసానే రహదారి పక్కనే నీ కోసం

దరి చూసానే నా దరి చేరనే సహవాసం ౹2౹

అందుకొని లేఖ అందుబాటులోకి రావా

అందలం ఎక్కించే ఎలమినే అందుకోవా ౹ప౹


చ౹౹

వచ్చిన అవకాశం వలపుతో గెలిపించవా

ఇచ్చిన మనసుకూ విలువునూ పెంచవా ౹2౹

అందుకే ..

శుభలేఖ తెచ్చా ఎదలోని ప్రేమను కలిపి

శుభాకాంక్షలూ చెప్పేందుకూ నీకు తెలిపి ౹ప౹Rate this content
Log in

More telugu poem from Ramesh Babu Kommineni

Similar telugu poem from Romance