ఒక స్వప్నం
ఒక స్వప్నం


ప౹౹
ఒక స్వప్నమే మరి కలిగిందీ వెన్నెల రేయి
ఐక్యమయి మదిలో చేర్చేఆ చల్లని హాయి౹2౹
చ౹౹
నదిలా సాగి వరదై పొంగే వలపు వాలకం
కథలా కదిలి కలలా తోచే తలపు లోలకం ౹2౹
వ్యధతో సాగే మనసు కోరేది స్వాంతనమే
ఎదలోని కల్పనలే కవ్వించు చిలిపితనమే ౹ప౹
చ౹౹
ఉదయకాలపు మంచులా కమ్మే ఊహలు
ఏదో స్వర్గం ఎదనే గిల్లగా పొంగే భావాలు ౹2౹
గుండెలో ఏదో తెలియని గుబులే రేపాయి
మండిన తడి మంటే తనువునే కలిపాయి ౹ప౹
చ౹౹
కదిలే మేఘమే వలపు వర్తమానం వర్షించ
కడలి నాదమై కలను నిజమే చేసి హర్షించ ౹2౹
ఆ స్వప్నమే అందివచ్చి మదిలో పులకించి
ఏ స్వాప్నికుని కోరికనో పరికించి ఆలకించి ౹ప౹