STORYMIRROR

Dinakar Reddy

Romance

3  

Dinakar Reddy

Romance

నవ్వులు

నవ్వులు

1 min
282

నవ్వులు

పగిలిన అద్దపు చప్పుళ్ళలో

పడే నీటి బొట్లలో                                                                                                

అర్థ రాత్రి తీతువు కూతలలో

ఆమె నవ్వులు


ఉప్పెన లాంటి శబ్దాలలో

ఉరిమిన ఆకాశపు మబ్బులలో

చిగురుటాకుల వణుకులో

ఆమె నవ్వులు


జూకాల కదలికలో

గజ్జెల చప్పుడులో

ఆమె నవ్వులు


ఎటు చూసినా ఆమె నవ్వులు

అతని నిద్రను ఆపి ఆలోచించేలా చేసే ఆమె నవ్వులు

అతను ఎంత వెతికినా కనబడని ఆమె ఆచూకీ


అతని విఫల యత్నాలు చూసి మరీ బిగ్గరగా వినిపించే ఆమె నవ్వులు

అతనికి భయాన్ని పరిచయం చేసెను ఆమె నవ్వులు


రచనకు రేటింగ్ ఇవ్వండి
లాగిన్

Similar telugu poem from Romance