STORYMIRROR

Midhun babu

Romance

4  

Midhun babu

Romance

ఓ సఖీ

ఓ సఖీ

1 min
6


పెనుశిలయె నీకన్న..నయములే ఓ సఖీ..! 

నీ పేరునే వ్రాయ..మురియులే ఓ సఖీ..! 


నాగుండె చెరువెంత..వెర్రిదో తెలుసునా.. 

నీ తలపు వానకే..పొంగులే ఓ సఖీ..! 


నీమాట మధురమే..అది మౌన రాగమే.. 

నీ చూపు గంధాలు..చాలులే ఓ సఖీ..! 


ఏ నీలి మబ్బులో..దాగున్న మెఱుపువో.. 

మైమరపు బహుమతిగ..ఇవ్వులే ఓ సఖీ..! 


పరదాలు తొలగించు..పరదేవతే నీవు.. 

బ్రతుకు పరమార్థమే..చాటులే ఓ సఖీ..! 


కట్టెలా నేనుంటె..జ్వాలవై చేరావు.. 

విరహాగ్ని గీతమై..మిగులులే ఓ సఖీ..! 



Rate this content
Log in

Similar telugu poem from Romance