హృదయం లేని వ్యక్తి
హృదయం లేని వ్యక్తి


ప్రతి వ్యక్తి కి ఉండెను ఒక హృదయం,
అన్ని రకమైన భావాలకు అయ్యెను అది నిలయం |౧|
దయ లేని వారికి అనవచ్చును హృదయం లేని వ్యక్తి ,
అలాంటి వారికీ ఎన్నడూ ఉండదు ఎదుటివారి భావన పై ఆసక్తి |౨|
స్వార్థంతో నిండి ఉండెను అలాంటివారి మనసు,
ఏ మంచి మాట లోని కనిపించదు అటువంటివారికి సొగసు |త్రీ|
ఇంతసేపు వారి పని అయిపోవటం వారికి ముఖ్యం,
మిగిలినవారి కష్టనష్టాలు ఎన్నడూ కావు వారికీ ప్రాముఖ్యం |౪|
ప్రజాప్రతినిధులు ప్రజావిరుద్ధమైన పనులు చేస్తే అయ్యేరు మనసు లేని మనుషులు,
వచ్చే ఎన్నికలలో అలంటి వారు అయ్యెను పదవి లేని మనుషులు |౫|
ఇలాంటో కఠినమైన వ్యక్తులు ఎప్పుడు వాడెను దుర్భాష,
ఆపేక్ష లేకపోవటంతో మనసులో కేవలం ఉండెను వివక్ష కక్ష |౬|
హృదయం లేని వ్యక్తి కి ఎవరు మెచ్చుకోరు,
అలంటి వారిని ఎవరు అవసరమైన సమయాన పట్టించుకోరు |౭|