నీవారు
నీవారు


బలంగా వశపరచుకోవడం బంధమా
తన ఆత్మ గౌరవాన్ని పణంగా పెట్టడం అనుబంధమా
ఎప్పుడూ నువ్వే గెలవాలంటే గెలవొచ్చు
కానీ తన వారి సంతోషం కోసం ఓడిపోవడం అంటే నీకు తెలుసా
నిన్ను తన సొంతం అనుకొని
నీ కోసం ఎంత మంది వారి ఆనందాన్ని త్యాగం చేస్తారో తెలుసా
అందుకే బంధాల్ని గౌరవించు
మిత్రమా!
అనుబంధాల్ని వదులుకోకు
నీవారిని ఓడిపోనివ్వకు
ముందడుగు వేయి
నీవారి కోసం జీవించు