STORYMIRROR

Tvs Ramakrishna Acharyulu

Drama

3  

Tvs Ramakrishna Acharyulu

Drama

ధూమపానం

ధూమపానం

1 min
265


నోట బెట్టినంత రాజసముట్టిపడు 

అగ్గిరాజేయ గుప్పు గుప్పు గుప్పుమనుచు 

గుండెలోకి వెచ్చగా ప్రవహించు 

రైలు బండివోలె ముక్కు పుటములనుండి 

రింగు రింగులుగా బయటకు వచ్చు 

ఊపిరితిత్తులందు విషమునింపి 

నెమ్మది నెమ్మదిగా శరీరమును ఆవహించు

రోగాల పుట్టగా మారి నీ నోట రక్తమును కార్చు 

క్షయ క్షయముగా నీ ప్రాణములు తీసుకొని పోవు

ఎందులకింత వ్యామోహమో ఓ నవ యువకులార 

ధరలుపెంచినగాని జంకకున్నారు 

ధరాతలము పై జీవించ మక్కువలేదొకో మీకు 

అమ్మ నాన్నల ఆశలు మీరు 

దేశ భవితకు వెలుగు దివ్వెలు మీరు 

ఆశయాలసాధనకై అడుగు వేయుడీ 

అల్పమైన దురభ్యాసములకు దూరముండి


Rate this content
Log in

Similar telugu poem from Drama