మజలీ
మజలీ


పుణ్యమేమి చేసావో
పుడమిపై పుట్టేందుకు
మాతృ గర్భమే తొలి నివాసం నీకు
తొమ్మిది నెలలు మాత్రమే అనుమతి
భూమిమీద పడ్డాక అమ్మ ఒడి నీమలి నివాసం
నీ యోగాన్ని బట్టి
పూరిగుడిసో ఇంద్రభవనమో నీ స్థిరనివాసం
వయసు పెరిగే కొద్దీ అవసరాలకనుగుణంగా
మార్పులు చేర్పులు జీవితంలో
పెళ్ళితో బంధం ఏర్పడి వేరు కాపురం
పేరుతో మరో నివాసం లోకి
ఎన్ని సౌకర్యాలు ఆనుభవించినా
ఏసుఖాలు లేకపోయినా
చివరిగా నిన్ను ఆత్మీయంగా ఆహ్వానించే
చివరి యిల్లు మాత్రం మరుభూమే