చాలదా
చాలదా
గజల్-చాలదా
చీకటినే కూల్చేందుకు వెలుగొక్కటి చాలదా
నిరాశనే తరిమెయ్యగ ఆశొక్కటి చాలదా
ఎదగాయం మాన్పేందుకు మందుకొరకు వెదకాలా
పైపూతగ రాసుకొనగ నవ్వొక్కటి చాలదా
సృష్టిలోన ప్రేమకొరకు ప్రతీకలూ ఎన్నెన్నో
చనుబాలతొ పంచుప్రేమ అమ్మొక్కటి చాలదా
కుసుమించే సుమాలన్ని సుగంధాలు వెదజల్లే
మానవతను పంచుకొనే మమతొక్కటి చాలదా
ఎడబాటుకు పొగిలిపొగిలి ఏడ్వనేల ఇంతగా
మిగిలిఉన్నజ్ఞాపకాలు మనకొక్కటి చాలదా
గుండెలోన నింపుకున్న నాన్నరూపు చెదరునా
నడ(క)తనేర్పు వేళలోన వేలొక్కటి చాలదా
రాంకిమనసు నిండుకుండ తొణకమన్నతొణకదులే
గుండెనిండ చెదిరిపోని దమ్మొక్కటి చాలదా