వ్యయం
వ్యయం
శిశిరం వ్యయమయితే నే కదా వసంతం వచ్చేది
స్వేదం వ్యయమయితేనే కదా సేద్యం చేసేది
వేదన వ్యయమయితేనే కదా వేడుక చేసుకునేది
అప్పులు వ్యయమయితేనే కదా ఆదాయం దక్కేది
కష్టం వ్యయమయితేనే కదా సుఖం వచ్చేది
దురదృష్టం వ్యయమయితేనే కదా అదృష్టం వరించేది
రాగం వ్యయమయితేనే కదా గీతం సాగేది
కండలు వ్యయమయితేనే కదా కడుపు నిండేది
ఆశలు వ్యయ మయితేనే కదా ఆశయాలు నెరవేరేది
మాటలు వ్యయమయితేనే కదా అంగీకారం కుదిరేది
ఆకులు వ్యయ మయితేనే కదా కొత్త చిగుళ్ళు వేసేది
ఒడిదొడుకులు వ్యయ మయితేనే కదా అనుభవం పండేది
భజన వ్యయ మయితేనే కదా భక్తిబావం పొంగేది
రచన వ్యయ మయితేనే కదా అభ్యుదయం వేల్లివిరిసేది
సర్వధారి వ్యయ మయితేనే కదా విరోధి వచ్చేది
వికారి వ్యయమయితేనే కదా ‘శార్వరి ‘ వచ్చేది
మన పండగ వ్యయమయితేనే కదా మనోల్లాసం మది నిండేది.
(ఉగాది కవిత)
*************