ఒప్పగింతలు
ఒప్పగింతలు


ఆడపిల్ల ఇంటికి కంటికి ఇచ్ఛేను అరుదైన అందం,
ఇంట్లో తన పలుకుబడి సందడి కలిగించేను వెలలేని ఆనందం |౧|
కూతురు తన తల్లితండ్రులతో చెప్పుకొనెను ఎన్నో సంగతులు,
ప్రతి మాటా పాటా ఆటా నింపెను అమ్మా నాన్నల మనసులో కాంతులు |౨|
ఉండెను కుమార్తె మనసులో పలు ఆశలు,
కాకూడదు అవి ఏనాడూ అడియాసలు |త్రీ|
అన్నదమ్ములుంటే పుత్రికకు ఎప్పుడు ఉండెను ధైర్యం,
తన సంఘర్షణ ఎప్పడు అవదు నిర్వీర్యం |౪|
యుక్త వయసులో దుహితకు తప్పదు వివాహం,
ఈ ఘడియ తండ్రి ఆలోచనలో రగిలించెను కలకలం కోలాహలం
|౫|
తన కుటుంబం నుండి వేరే కుటుంబాన్నికి చెయ్యాలి అప్పగింతలు,
ప్రతి ఆడపిల్ల తల్లితండ్రులకు తప్పదు ఈ ఒప్పగింతలు |౬|
రామాయణంలో మహారాజు జనకులు సీతాదేవిని చేశారు శ్రీరామునకు అర్పితం,
కలియుగంలో ఆకాశరాజు పద్మావతి దేవిని చేశారు తిరుమల శ్రీనివాసునకు సమర్పితం |౭|
ఈ సమయమున వచ్చెను అందరికి కన్నీళ్లు,
కూతుర్ల అనుపస్థితితో బోసిపోయెను కన్నవారి లోగిళ్ళు |౮|
ఒప్పగింతలు అయిన మాత్రాన కన్నా కూతురిని మరువరాదు,
ఎప్పటికప్పుడు తన బాగోగులను పట్టించుకోవటం విడువరాదు |౯|