నిరీక్షణ
నిరీక్షణ


నిరీక్షణ
*******
ఏ విరబూసిన మల్లెలు చూసినా
నీ సిరినవ్వుల దొంతరేమోననే ఆశ
ఏ కోయిల కూజీతం వినినా
నీ వీణా తంత్రుల గానమేమోననే పరవశం
ఏ సిరిమువ్వల చప్పుడు వినినా
నీ పద మంజీరాల మృదునాదమేమో ననే ఆలాపన
ఏ గాజుల సవ్వడి వినినా
నీ రత్న కంకణాల రవళు లేమోననే అభిలాష
ఏ ఆకులు గలగల మన్నా
నీ పద ద్వనులేమోననే ఆత్రుత
ఏ గాలి గుసగుసలాడినా
నీ పెదవుల కదలికేమోననే పులకింత
ఎ చూపులు గిలిగింతలు పెట్టినా
నీ ప్రేమ చూపులేమో నని ఆశ
కాని....నా ఆశల్ని అభిలాషల్ని
నా ఆరాటాన్ని, పరవశాన్ని
నా మదిలో శాశ్వతం చేసి
నీకై నిరీక్షణ నిరాశగా మిగిల్చి
నీ జ్ఞాపకాలు నా ఎదలో చిత్రించి
అందనంత దూరం చేరిపోయావు
ఆకాశంలో దృవ తారవై నీవు
అవనిపై ఎడారిగా నేను
*************