దగాపడ్డ తమ్ముడు
దగాపడ్డ తమ్ముడు


విథి వంచితుడైన ఒక తమ్ముడు
అందరి చేత కీలుబొమ్మైనాడు
కడుపున పడి తల్లికి శతృవైనాడు
ఇలపై పడి ఆమెకు దూరమైనాడు
పెంచిన వారికి ప్రేమ పాత్రుడైనాడు
వారింట ముద్దుల కొడుకైనాడు
అమ్మా నాన్నల గారాబు బిడ్డడు
అక్కకి ఒక్కగానొక్క చిట్టి తమ్ముడు
విథి వక్రించి తండ్రి దూరమైనాడు
అక్కా అమ్మల లాలనలో పెరిగాడు
పెరిగిన కొద్దీ కొందరి దృష్టిన పడ్డాడు
వారి మాటలనే నిజమనుకున్నాడు
ఇంటి వారిపై నమ్మకం కోల్పోయాడు
బైట వారినే ఆత్మీయులను కున్నాడు
అక్కా అమ్మలను శతృవులను కున్నాడు
వారిపై ద్వేషాన్ని పెంచుకున్నాడు
పేదది,
పెద్దదైన అమ్మను విడిచి పెట్టాడు
అక్కా బావలను దూరం చేసుకున్నాడు
పెర వారిని నమ్మి వారికి తలవంచాడు
చెడు మితృలను, బంధువులను నమ్మాడు
అక్కా అమ్మలను కాదనుకున్నాడు
తన సంసారాన్ని ఏర్పర్చు కున్నాడు
ఆ సాగరంలో నిండుగా ములిగాడు
పంతంతో ప్రాణాలు పోగొట్టుకున్నాడు
జీవితాన్ని అర్థాంతరంగా ముగించాడు
తల్లికి శాశ్వతంగా దూరమైనాడు
పేదతల్లికి తీరని శోకాన్ని మిగిల్చాడు
అక్క మదిలో దుఃఖాగ్ని రగిల్చాడు
అక్క స్మృతిలో చిరంజీవిగా నిలిచాడు
ఆతడామెకు ఎప్పటికీ చిరస్మరణీయుడు
ఆమె కు కాలం మిగిల్చిన గాయం అతడు