పయనం సాగుతుంది
పయనం సాగుతుంది


ఏమీ చేయలేవన్న నిరాశ వాక్కుల నుంచి
ఎటూ పోలేవన్న ఆంక్షల నుంచి
నిను నాశనం చేస్తామన్న బెదిరింపుల నుంచి
నీ పొందు కోసం ఏదయినా చేస్తానని రాత్రి మాత్రమే వినిపించే వాగ్దానాల నుంచి
నీవు దగ్గరికి వస్తే అపవిత్రత అని పగలు వినిపించే హేళనల నుంచి
తన శరీర భాగములను ఎలా అనుభవించాలో అని చర్చల నుంచి
దాసి అనీ మరెన్నో వినలేని వినకూడని(?) పిలుపుల నుంచి
ఆమె దూరంగా వెళ్లిపోయింది
తనకు తానే తోడుగా
తన అభిమాన సంరక్షణమే లక్ష్యముగా
తన జీవితమును గౌరవముగా స్వేచ్చగా జీవించేందుకు
అంకురార్పణ తన మొదటి ప్రయాణం
మరి తనకు శుభాకాంక్షలు చెబుదామా
వెన్ను దన్నుగా ఉందామా
లేక వేల సంవత్సరాలుగా
అణగదొక్కబడిన(?) జీవచ్చవంలా మారుద్దామా
ఏది ఏమయినా
ఎవరెన్ని విధాలా ప్రయత్నం చేసినా
ఆమె తన దాస్య శృంఖలాలను తెంచుకుంటుంది
పురోగమనం వైపు ఆమె పయనం సాగుతుంది