అందరి తొలిరోజు
అందరి తొలిరోజు
మరువక తప్పని రోజు,
మరిచినా తలవక తప్పని రోజు,
మది మరిచినా హితులు మరవని రోజు,
ప్రకృతి మొదటి శ్వాస పీల్చి రోధించిన రోజు,
జీవితపు చరమదశకి తొలి రోజు,
మోహమాటపు బహుమతులు తెచ్చిపెట్టె రోజు,
అమ్మ దేహం నుండి నాన్న వడిలోకి చేరిన రోజు,
ఇంకా మీ మస్తిష్కంలో మెదలలేదా ఈ రోజు..!!
అదేనండి నా పుట్టిన రోజు,
మా అమ్మ హృదయంలో ఎప్పటికి మర్చిపోలేని రోజు...!!