అమ్మ కూడా ఆడదే!!
అమ్మ కూడా ఆడదే!!
నా శరీర ఛిద్రం నీ జననం!
నీ నీచపు కృత్యం నా మరణం!!
నా రక్త మాంసాలు నీ దేహం!
నీ కామవాంఛలకయ్యాను ధ్వంసం!!
అమ్మా అంటూ పిలిచి!
అమానుషంగా చెరిచాడు!!
తల్లి జాతని తెలిసీ!
కర్కశంగా కడ తేర్చాడు!!
పసి తనువుతో చెలగాటం!
లేత
ప్రాయానికి ప్రాణ సంకటం!!
పెంపకాల్లో లేదు మమకారం!
ప్రతి మగాడికి కావాలి కనికరం!!
నీడను సైతం వెంటాడి!
ఎదలో పెంచాడు అలజడి!!
మదిలో ప్రశాంతత కొరవడి!
ఉరికి వేసాడు మరో ముడి!!
జనని ఉదరంలో ఆడ ఉనికి!
మరు క్షణమున పంపాడు కాటికి!!
సమాజంలో చట్టాలు దేనికి!
అవగతం కాదు నా మతికి!!
***