రాజీపడిన నా దేశం
రాజీపడిన నా దేశం


రాచరికం నుండి బానిసత్వం నుండి విమోచనం పొందిన ఓ నా దేశమా,
స్వరాజ్య భక్షణ లో నలుగుతూ,
రంగుల ప్రపంచాన్ని దూరవాణి లో చూస్తూ,గొంతుకతలోని భావోద్వేగాన్ని చరవాని లో చేరవేస్తూ వాస్తవికతకు దూరం అవుతూ,
జీవితంలో సలక్ష్యం లేకున్నా , నిర్లక్ష్యము తో బతుకు ఈడుస్తున్న భవిషత్ తరాలును చూసి మదన పడుతూ,
పిచ్చెక్కిన అభిమానంతొ ఉత్స నీచయాలు మరచి జీవిస్తున్న పుత్రులను పెంచుతూ,
మితిమీరిన భాష తో, శ్రుతి తప్పుతున్న యాసతో, గతి తప్పిన మూడాచారాలు తో మూలాన పడుతూ,
మతోన్మాదులు ను అంగరక్షకులు గా భావిస్తూ,
సరస్వతి కటాక్షానికి లక్ష్మి కటాక్షం ఇప్పించలేక, మొహం చెల్లక దాగుడు మూతలు ఆడుతూ,
అభివృధి లో తిరోగమనం లో పయనిస్తూ, విదేశీ సంస్కృతి కి పురోగమనం లో పరుగుతీస్తూ,
జీవనదులు ఎన్ని వున్నా ఎండిన భూములు మెండు గా వున్న భయంతో కాలయాపన చేస్తూ,
నాణ్యత లేని వస్తువుల తో విదేశీ మారకపు విలువ తో పోరాడుతూ,
అధిక వ్యవసాయ భూములు వుండి ఆకలి చావులతో నిర్జీవమైన వెలుతురు లో ప్రగతి కోసం ఎదురు చూస్తూ,
సంపనుల నీడ ల మద్య అధికారుల ఆశల మధ్య నలుగుతూ,
ఘనమైన కీర్తి గల్గిన దేశం లో నీచమైన రాజకీయాలకు బలి అవుతూ,
బహు జనజీవనం తో ఉకిరి బిక్కరి అవుతూ,
భినత్వం లో ఏకత్వం వున్నా ముష్కరుల తో కాష్టంలా రగులుతూ,
భువి నుండి దివికి వెళ్ళినా మతతత్వం కులతత్వం వీడక మతి చెల్లుతూ,
ప్రజాస్వామ్య ప్రభుత్వం లో న్యాయం ధర్మం కోసం పాకులాడుతూ,
ప్రకృతి తండవాలకు మానవ వికృత చేష్టలకు తల్లడిల్లుతూ,
భవితవ్యం వున్నా గతానే స్మరిస్తూ వర్తమానాన్ని మరుగున పడేస్తూ,
తర తరాల నుండి యువ శక్తి వున్న ఇంకా మీన మేషాధు ల లెక్కల లో మునుగుతూ,
ప్రకృతి లో వనరులు పుష్కలంగా వున్నా సంకల్పవికల్పాల తో కొట్టుమిట్టడుతూ,
చేరుకోవాల్సిన లక్ష్యాలు ఎన్ని వున్న ఆంక్షల అవధులు దగ్గర ఆగిపోతూ,
అంగవైకల్యం నీ జయించిన చిరంజీవులు ఎందరో వున్న బుది వైకల్యాన్ని జయుంచలేకపోతూ,
బహుళ అంతస్తుల సముదాయాల మద్య ఇరుకున పడిన వృదాప్య గృహాలు మోస్తూ,
సాని కొంపలు లోని నిజాయితీ కూని కొంపలలో ధైర్యం లో ఒకటోవ వంతు కూడా లేవని కుములుతూ,
సేవ అనే ముసుగు లో స్వార్థం నీ వెలుగు చూస్తూ,
సామాజిక బాధ్యత ను మరచి ,వ్యక్తిగత భాద్యత ను విడిచి సంఘసంస్కర్త లు గా చలామణి అవుతున్న మనిషినీ చూస్తూ చలిస్తూ,
చెవిలో గుసగుసలు తో నే రుసరుసలు పూటించి యుద్ధం లో గెలిచే చానుక్యులతో సావాసం చేస్తూ,
వివాహ బంధం తో ముడిపడి, అర్దం చేసుకునే మనస్సులు కొరవడి, అదే బందాని న్యాయబద్దంగా గా తెంపుకుంటూ,
భక్తి కి మార్గం రక్తి అని, భక్తి నీ మరచి రక్తి నుండి ముక్తీ పొందాలి అని చూస్తూ విముక్తి కోసం వేదన పడుతూ,
కంచం లో కూడుకోసం , లంచానికి మంచానికి బానిస అయిన ప్రజా సేవకులను పంచన చేరుతూ,
అక్షరాస్యత లో మూర్ఖత్వం చూసి ఎడవలో , నిరక్షరాస్యత లో అమాయకత్వం చూసి నవ్వా లో తెలియక అయోమయంతో కాలం గడుపుతూ,
పక్ష పాతం తో, తన మన అనే సంపూర్ణ వ్యత్యాసం తో పాలిస్తున్న నాయకుల మధ్య విసుగు చెందుతూ,
అమాయుకుల శ్రమ దోపిడీ నీ జన్మ హక్కు గా , పారిశ్రామికులు అందలం ఎక్కుతుంటే పిచ్చి చూపులు చూస్తూ,
వంచన తో విజయం, అవినీతి తో ఆదాయం, ప్రలోబాలతో పేరు సంపాదించే వక్రమార్కులు అయిన విక్రమార్కుల ను చూస్తూ విషాదం లో మునుగుతూ
రాజీ పడిన ఓ నా దేశామా?
ఇకనైనా!
నువ్వు సహించి, భరించి జాగు చేసిన సమయం చాలు,
లే లేచి జ్వాలించు ఆ జ్వాలకి వచ్చే వేడికి జీవ నదులు
నీరు వేడెక్కి , సూప్త అవస్థ లో వున్న మంద కి ఆ నీటి తో అభ్యంగనస్నానం చేపించి తట్టి తట్టి లేపు.