STORYMIRROR

యశస్వి ✍️

Others

3  

యశస్వి ✍️

Others

పాఠకుడు

పాఠకుడు

1 min
11.4K

అక్షరాలు ఏరే శ్రామికుడు

లక్షణాలు కోరే ఆప్తుడు

సమీక్ష రాసే మిత్రుడు

విమర్శ చేసే సమర్ధుడు

అలుపెరగని కళ్ళతో స్పృశిస్తాడు

నిద్రలేని రాత్రుళ్ళు ఎన్నైనా

అనుభూతుల ఆనవాళ్లను

మదిలో నిలుపుతాడు కొన్నేళ్ళు

లీనమైన మనసులు

చేస్తాయి ఎన్నో ఊహాగానాలు

నిక్కమైన యోచనతో సంబరాలు

తలకిందులైతే విస్మయాలు

ప్రతీ పుటలో భావోద్వేగాలు

చదివే గుండెల్లో భావావేశాలు!!

కవి కలంతో పరిచయాలు

పఠితుల యెదలో చెరగని ముద్రలు!!



Rate this content
Log in