నిజ జీవితపు అవధులు
నిజ జీవితపు అవధులు


జీవితంలో,
అదుపు తప్పిన ఆవేశం, కోపం
మితిమీరిన వేగం, ప్రమాదం
శృతిమించిన స్వరం, అప్రయోజనం
గతి తప్పిన మార్గం, అలక్ష్యం
హద్దుమీరిన చమత్కారం, అనర్థం
మతితప్పిన ఆలోచన, దుర్భుద్ధి
గాడి తప్పిన సంస్కృతి, విచ్చలవిడితనం
తుదకు మిగుల్చు మానని గాయాలు.