ఉదయబాబు కొత్తపల్లి

Tragedy

4  

ఉదయబాబు కొత్తపల్లి

Tragedy

ఎండుకొమ్మలు

ఎండుకొమ్మలు

1 min
342


ఎండుకొమ్మలు


మొన్నటి చిగురాకులు

చిగురించిందీ కొమ్మలకే...

ముదిరి ముదిరి ఆకులయ్యిందీ

పసరు రక్తాన్ని పీల్చి పిప్పిచేసాకనే...

నిన్నటి నిగనిగల ధగ ధగలకు

విర్రవీగుదనం రెపరెపలాడిపోతుంది.

ఒకచేతివేళ్ళు సమం కావన్నట్టు

రకాల తెగుళ్ల దాడికి వెన్నువంకర ఆకులు...

ఆకారంలో పాటు అంతరాలల్లో

కూడా బూజు పట్టించుకుని

కొత్త చీడల వరమాలకు సమాయత్తమౌతాయి...

లోపిస్తూ వ్యాపించడమే తప్ప

చీడకేం తెలుసు కొమ్మ విలువ?

చీడ ఇచ్చే పీడ రుచిమరిగినాకా

కొమ్మ సత్వపు సత్తా తెలిసికూడా

గుక్కెడు నీళ్లు మొదలుకు అందవు...

కాలం తీరిన కొమ్మ ఎండుపుల్లగా

మలిగిపోతూ కుమిలిపోతున్నప్పుడు

నిప్పంటించి చలికాగే ఆకులు...

ఎండుటాకు లై రాలిపోతూ కూడా

కన్నీళ్లు వర్షించని పశ్చాత్తాపం

చిగురిస్తున్న కొత్త పిట్టలకు గుణపాఠమే...!!!


******




రచనకు రేటింగ్ ఇవ్వండి
లాగిన్