'అతడొక అనుభూతి పులకింత'(కవిత)
'అతడొక అనుభూతి పులకింత'(కవిత)


అతనొక అనుభూతి పులకింత!!!
మాతృభాషని మమకారపు భాషగా/
చేసుకోవాల్సిన తెలుగు సోదరులు/
పరభాషా పరాన్నజీవులై మలుగుతున్న దైన్యంలో/
కన్నవారి పెంపకపు సరోవరంలో/
విజ్ఞానంతో ప్రభవించిన అభినవ సాహితీభోజుడతడు/
విద్య నేర్పిన సంస్కారం పరిమళించిన పూవతడు./
మస్తిష్కంలోమొలకెత్తిన సాహితీ సేవామొలక/
అనంతసాహితీగవాక్షాలను స్పృశించే వృక్షమై/
సాహితీ ఎడారి హృదయాలలో ప్రక్రియల ఖర్జూరపు/
పంటలు పండించిన కాలాపరిమితులులేని కృషీవలుడతడు/
వేయి 'చేతల' కార్తవీర్యార్జునుడై సహస్ర కవీశ్వరపీఠాన్ని/
స్థాపనానిర్వహణా ఘటనా ఘట సమర్థుడతడు/
ఆ వటవృక్షపు నీడలలో తమ మణిపూసల/
కవితా ఛాయల్ని పదిలపరచుకున్న ఊడలెన్నో/
అనంత సాహితీ సాగరానికి సేతుమాధవుడై/
మనిషిలోని అభినివేశపు అభిరుచిని స్వాగతించి/
ఆదరించి 'కవి'త్వేకరింపచేసిన అభినవ భోజుడతడు/
నిర్మల, నిశ్చల సాహితీ సేవా తత్పరత మూర్తిగా/
తెలుగుతల్లి ఒడిలో అతడొక అనుభూతి పులకింత./
సమాప్తం.