ఏం మాట్లాడాలి? (కవిత)
ఏం మాట్లాడాలి? (కవిత)


సుప్రసిద్ధ గాయకుడు శ్రీ ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం మరణం సంగీత ప్రపంచానికి తీరని లోటు అని భావిస్తూ...!!!
ఏం మాట్లాడాలి?
ఒక సంగీత నిఘంటువు
అర్ధాలు కోల్పోయాకా!
సూన్యంలో నిశ్శబ్దరోదన.
రోదన రాగాలలో సంగతులు
సరిద్దిద్దే స్వరరాజును
వెతుక్కుంటున్నాను.
ఒక అదృశ్యరూపం
అందిస్తున్న సూచికపై రేటింగ్
హర్షధ్వానాల గులాబీరేకల
మధ్య నాలో ప్రోత్సాహపు కుదుపు.
సాధించి తీరాలన్న లక్ష్యపు
ఆరోహణ&nbs
p;క్రమంలో...
దిశానిర్దేశపు గాన గంధర్వము
గోడమీద స్వర్ణచిత్రంమైపోయిన
అధమాతి అధమ క్షణం
అనివార్యమేనా ఎవరికైనా?
ఒక స్వర్ణకమలపు సంగీతాభిషేకంతో
సరస్వతమ్మ శృతి వినబడని వీణానాదంలో
ఒక అష్టమ సముద్రం అలల వేగాన్ని
నియంత్రించుకుంటూ
సెలయేరు కెరటాలనన్వయించుకుంటూ
కొనసాగుతూ...సాగుతూ...!!!
***********
కొత్తపల్లి ఉదయబాబు
సికింద్రాబాద్