అల్పాహారం !
అల్పాహారం !
ఒక అమ్మ కడుపున పుట్టామన్నది
మరిచిపోయే నిజమా...
ఒక నాన్న నిజాయితీపెంపకాన్ని
వెక్కిరించే ప్రవర్తన అవసరమా?
మనుషులమై సాటి మనుషుల రక్తాన్ని
కోరుకోవడం కసాయి సాధుత్వమా....
ఎండు గడ్డి మేసి శ్వేతామృతాన్నిచ్ఛే
పశువుల ధర్మనిరతి పై అనుమానమా...
మానవత్వాన్ని మరిచిన
జంతుప్రేమాన్వేషకులారా...
మీకోసమే.....ఈ మనిషిచాటు
గడ్డిమేటు....!!!