STORYMIRROR

Dinakar Reddy

Abstract Drama

4  

Dinakar Reddy

Abstract Drama

ఇక ఇంతేనేమో..

ఇక ఇంతేనేమో..

1 min
7

జరిగిన విషయాలను జావళిగా

జరగని విషయాలను కోర్కెల మాలలుగా

నేను కాలాన్ని అనుసరించి వెళ్ళాను

మొక్కల పాదుల దగ్గర 

ఇంకుతున్న నీటి చుక్కలు చూస్తూ ఉన్నాను


ఎవరో పాట పాడుతున్నారు

మరెవరో ఏదో జ్ఞప్తికి వచ్చి

కన్నీళ్లు పెట్టుకున్నారు

తొలి ముద్దు స్పర్శ

తరువాత మోసంగా మారిందనా

అరికాళ్లను ఒత్తే చేతులు

పీక పట్టుకుని బెదిరించాయనా


క్షణ క్షణానికి మారే మనిషి రంగుల్లో

ఏ రంగును చూసి భయపడినట్లు నటించాలి

ఇక ఇంతేనేమో

దేబిరించుకుని చూస్తూ 

ఒంటరితనమనే సరస్సు ఒడ్డున నిలబడ్డాను


ఎవరిని నమ్మాలి అనే ప్రశ్న లేదు

భేతాళ కథలలాగా 

ఆపకుండా వచ్చే సందేహాలను పట్టుకుని

ఇలా ఉన్నాను

బహుశా భగ్న హృదయాలు ఇలా ఉండేవని 

సగం కాలిన నా చితిని చూసి అంటారేమో


రచనకు రేటింగ్ ఇవ్వండి
లాగిన్

Similar telugu poem from Abstract