STORYMIRROR

Dinakar Reddy

Abstract Drama

4  

Dinakar Reddy

Abstract Drama

ఇంకనూ రావేల..

ఇంకనూ రావేల..

1 min
11

 వచ్చెను తలపుల వాకిట

వర్షము దాటిన ఋతువు

చలికి వణికిన ఉడుత ఒకటి

మరల చెట్టు తొర్రను చేరె


కాలనాగు కూడా

జంట కోసం వెతికె

పూవులు వెన్నెలను పట్టి

ముద్దుగ సుగంధము నాపై చల్లి

నన్ను సింగారించె

యుద్ధమున చేరి 

నీవు నన్ను మరచితివో


లేదా ప్రాపంచిక సుఖములేల అనుకుని

వైరాగ్యమున దూరంగా ఉంటివో

జాగు సేయక

జాబు అయినా పంపరాదురా

దొరా

వెన్నెల వంటి నీ నగుమోము ఒకపరి చూపి

మరల ఈ ప్రేమ దాసిని అనుగ్రహింపరాదురా

తప్పు ఒప్పుల ఆలోచనల సంధి కాలములో


నేను కాలాన్ని పారబోసాను

సముద్రములో చిరునవ్వును విసిరేసాను

వచ్చే దారిలో కాస్త సంతోషాన్ని తీసుకురా

చెరో సగమై

ఒకరిలో మరొకరి ఉనికిని కోల్పోయి

ఇంకోసారి మధుర యాత్ర చేద్దాం


ఇంకనూ రావేల

ఈవేళ 

నీవు లేక నన్ను నేను సంభాళించుకోలేక

ఎదురు చూస్తున్నా అని 

ఆమె అతడికి మనో సందేశం పంపింది


రచనకు రేటింగ్ ఇవ్వండి
లాగిన్

Similar telugu poem from Abstract