STORYMIRROR

Dinakar Reddy

Abstract Drama

4  

Dinakar Reddy

Abstract Drama

కోరని వైరం

కోరని వైరం

1 min
10

నువ్వనుకుంటే

అన్నీ మారిపోతాయా

కానీ మంచే కదా అనుకున్నాను

మంచికి ముంచే లోకమిది

రెండు పార్శ్వాలు

దృక్కోణాలు మరెన్నో


ఇంత కన్నా ఏం జరుగుతుంది

అనే తెగింపు ఒక పక్క

ఏం మాట్లాడితే ఏం ముంచుకొస్తుందో

అనే భయం మరో పక్క

చెప్పడం సులువే

కానీ వదులుకోవడం వల్ల కావట్లేదే


ఇంకా ఎవరో గుర్తిస్తారని

నీ గురించి చెప్పుకోవాలని

ప్రయత్నాన్ని ఆపవా

పోతే పోనీ అని

ధూళిలా నిన్ను వదిలించుకున్న వారి కోసం

ఇంకా బాధ పడాలా

ఈశ్వరునికి ఏమని విన్నవిస్తున్నావ్


నీ మీద నుంచి తొక్కుకుంటూ వెళ్లిన వారు

వారి పాదాలు బాగుండాలనా

అదొక్కటే చేతొచ్చునా

పర్లేదు

నిన్ను నువ్వు మార్చుకోవాలనుకుంటే తప్ప

ఎవ్వరూ ఏమీ చెయ్యలేరు

ఇదొక్కటీ అర్థం చేసుకుని

జీవితాన్ని అర్థవంతం చేసుకో


రచనకు రేటింగ్ ఇవ్వండి
లాగిన్

Similar telugu poem from Abstract