STORYMIRROR

Dinakar Reddy

Abstract Drama

4  

Dinakar Reddy

Abstract Drama

భావావేశము మార్చెను వేషము..

భావావేశము మార్చెను వేషము..

1 min
356

కళ్లకు కనిపించినంత సేపూ

ఎవ్వరూ పలకరించరు

కాస్త కదలగానే వెతికి

కనుమరుగైన వెంటనే

మావాడందురు


భావాలన్నీ పోత పోసి

ఒక బొమ్మ చేసాను

యద లోయల్లో ఏ మూలో

దాగిన భావావేశము 

పాత విషయాల్ని మరలా గుర్తు చేస్తూ

కొంత ఆనందమును 

మరింత దుఃఖమును 

బహుమతిగా ఇచ్చినది


లిపి లేని భాషలా

మౌన సంద్రాన నవ్వుల నావలా

ఒక సూర్యోదయాన్ని పలకరించి

చలన చిత్రాల్లో కనిపించని కథలా

మన ప్రేమ మిగిలింది


వేషము మార్చి

కొత్త భాషను నేర్చి

తలపుల తలుపులు తెరచి

విభిన్న అభిరుచుల సంగమించి

గతించిన కాలములో రమించి


నీకోసమే 

ఇలా వేచున్నా

జ్ఞాపకాల లెక్కలంటావా

అవెప్పుడూ కాలమనే తూనిక రాళ్ళకు అలుసే


ఇక రహస్యాలకు విలువేముంది..



రచనకు రేటింగ్ ఇవ్వండి
లాగిన్

Similar telugu poem from Abstract