మాయలు మంత్రాలు
మాయలు మంత్రాలు
కూటికోసం... గూడుకోసం...
సంపాదన కోసం... మేడల్లో జీవితం కోసం...
పల్లెను వదలి పట్టణానికి పరుగు తీస్తుంటే ...
పల్లెసీమ చిరునవ్వును మరచిపోయింది...విషాధ ఛాయలతో...
కుర్రకారుకు రెక్కలొచ్చి
చదువులంటూ కొందరు...
ఆకాశానికి నిచ్చెనవేస్తూ...
ఎదుగుతూ ఇంకొందరు...
పల్లె మూలాలని మరచిపోతూ..
పెద్ద నగరాలలో,భవనాలలో నివాసం
బుద్ది మాత్రం శూన్యం...
అజ్ఞానం తో పరిగెడుతూ...
వ్యవసాయంతో నాటి జీవితాలు...
గంజి తాగి అయినా వందేళ్ల జీవితాలు...
కానీ...
ఆధునిక ప్రపంచం మునుముందుకు సాగిపోతుంటే...
మూఢ నమ్మకాల మాయలో...
మంత్రాల ఊభిలో..
నేటికీ మారని జీవితాలు...
ఒకవైపు ఆకాశానికి నిచ్చెనవేస్తుంటే...
మూర్ఖత్వానికి మారుపేరుగా మారి...
పసి పాపను సైతం,
ముసలి వాళ్ళను సైతం బలి చేస్తుంటే...
ఆధునిక జీవితం ఆదిమవాసుల వైపు పరుగుపెడుతుంది..
అద్భుతమైన సాంకేతిక పరిజ్ఞానం ముందర కనిపిస్తుంటే ...
మాయలు మంత్రాలు అంటూ
జంతు బలి,
నరబలి చేస్తూ...
అజ్ఞానమనే అంధకారం లో బ్రతుకుతూ
ఇంకా ఇంకా ఊభిలో కూరుకుపోతున్న నేటి జీవితం ...
ఒక వైపు జీవితంలో వెలుగు ప్రసరిస్తుంటే...
ఆలోచనల్లోను ... అడుగుజాడల్లోను
మార్పు రాక...
చీకటి వైపు పరిగెత్తుతుంటే...
ఈ నవయుగం కాస్తా...మంత్రాల మాయాయుగం లాగా మారి...
జీవితాలను చిన్నాభిన్నం చేయక మానదు...
ఇకనైనా...
మంత్రాలు... మాయలు...
మూఢనమ్మకాలు మరచి...
ఆధునిక యుగానికి... ఒక నిర్వచనాన్ని ఇస్తూ మారుదాము...
లేదా...
వాటిని నమ్ముతూ మూర్ఖంగా బ్రతుకు చాలిద్దం
