నా తోడు
నా తోడు
ఊహ తెలిసిన కొత్తలో
నాకు తోడoటే ..అమ్మ అనుకున్నా.
ఎదిగే కొద్దీ ఆ నీడ నాన్నగా మారింది.
ఎదిగిన ప్రాయంలో ..
నా చెల్లెలే నా నిజమైన తోడనిపించింది.
అందుకోసమే ఆమెను దేవుడు పుట్టించడానిపించింది.
నాతిచరామి అని నువ్వు ఒట్టు పెట్టినా..
నన్ను అంటిపెట్టి నాతోనే నువ్వున్నా..
నీవల్ల పుట్టిన రెండు చిట్టి నీడలూ నాతో శాశ్వతమనుకున్నా.
ఆ నీడలు రెట్టింపయ్యాక..
తమ తోడుతో కలిసి గట్టెక్కాక..
ఇప్పుడు తెలుస్తోంది నీ తోడు ఉనికి..
నా కంటి రెప్పలా..నా ఆశ కి ఆకృతిలా..
ఇలా ..నా అసలైన నీడలా.