STORYMIRROR

Kalyani B S N K

Abstract

3  

Kalyani B S N K

Abstract

అమ్మ

అమ్మ

2 mins
200

వివాహం తరువాత జాబ్ వద్దన్నాడు వదిలేశా..!


ఫోన్ నెంబరు మార్చేయాల్సిందే అన్నాడు మార్చేశా..!


ఫేస్బుక్ కూడదన్నాడు నెట్ కట్టేశా...!


మగ స్నేహితులుతో స్నేహం అవసరమా అన్నాడు స్నేహానికి చరమగీతం పాడా...!


లెగిన్స్ అంటే అసహ్యం అన్నాడు. చుడీదార్ కి మారా..!!


హీల్స్ కి నో అన్నాడు. సాదారణ చెప్పులకి యస్ అన్నాను...!


జాకెట్ కి కిటికీలేంటన్నాడు... మెడ వరకు మొత్తం కప్పేలా వస్త్రాలకి ప్రాధాన్యం ఇచ్చా...!


పెదాలకి రంగులేంటి అన్నాడు పాండ్స్ ని కూడా దూరంగా ఉంచా...!


పార్లర్ కి వెళ్ళద్దు అన్నాడు. పార్లర్ గడప తొక్కడమే మానేశా..!


కొన్ని రోజులు సంతోషంగా ఉన్న తర్వాత ..


పిల్లల కోసం కొన్ని రోజులు ఆగుదాం అన్నాడు.. మాత్రలనే మాసం మాసం పెంచుకుంటూ వచ్చా..!


వారంలో ఏడు రోజులూ తనకిష్టమైన వంటకాలే వండాలి..!


వారాంతంలో స్నేహితులుతో గడిపి సగం రాత్రి ఇంటికి తిరిగేవారు..!


రాత్రి ఒంటిగంటకి ఇంటికి చేరా అంటూ తన మొబైల్ కి అమ్మాయి పేరున్న నెంబరు నుండి మెసేజ్..!


తెల్లారక ఎవరని అడిగా ... ex lover అన్నాడు..!


వదిలెయ్యమన్నాను.. వల్ల కావడం లేదన్నాడు...!


ప్రయత్నం చేయ్ నీకు తోడు నేనున్నాను అన్నాను.. నువ్వూ తను ఒకటా అన్నాడు..!!


వేరు వేరే .. నేను లీగల్ తను ఇల్లీగల్ అన్నాను... నాకు చెంప పగిలింది..!


నీ కోసం అన్నీ వదిలేశాను నా కోసం ఇదొక్కటి వదిలెయ్యలేవా అన్నాను.. కుదరదు its true love అన్నాడు..!!


నాక్కూడా ట్రూ లవ్ ఉంది అన్నాను. మరిచిపోవాలని వారం రోజులు బంధించి హింసించాడు..!!


ఓర్చుకున్నాను. తనలో ఎటువంటి మార్పూ లేదు..!


తిరిగి ఫేస్బుక్ ఓపెన్ చేశాను. !

తిరిగి లిప్ స్టిక్ రాయడం మొదలెట్టాను.!

తిరిగి జాకెట్ కి కిటికీలిచ్చాయ్.!

తిరిగి వేషధారణలోకి లెగిన్స్ వచ్చాయి.!

పార్లర్ సాధరంగా అక్కున చేర్చుకుంది.!

వంటల్లోకి నాకు నచ్చిన వంటలూ చేరాయి.!


సోషల్ మీడియా అంతటా ప్రేమ కవితలు రాశా.!


తిరిగి జాబ్ కి వెళ్ళడం మమొదలుపెట్టా.!


జాబ్ నుండి లేట్ గా ఇంటికి రావడం మొదలెట్టా.!


మగ స్నేహితులతో స్నేహం చిగురించింది..!


అప్పుడప్పుడు వీకెండ్ పార్టీలు మొదలయ్యాయి.!


చాటుమాటుగా ఫోన్ కాల్స్ మక్కువయ్యాయి.!


మొబైల్ కి, లాప్టాప్ కి పాస్వార్డ్ లకి అంకురార్పణ చేశా!


తనకి ఉన్న వెయ్యి పనుల్లో నన్ను గమనిస్తూ ఉండటమే ముఖ్యమైన పని ఇప్పుడు.!


తన ఇంటి భోజనం తనకే సొంతం అన్నట్లు దొంగతనం జరగకుండా కాపాడుకోవడానికి సెలవు రోజుల్లో కూడా బయటకి వెళ్లకుండా ఇంట్లోనే ఉన్నారు.!


ఎలాగైనా నా ex lover కాళ్ళు చేతులు పట్టుకోవాలని నా చుట్టూనే తిరగసాగాడు.!


ఈ జన్మలో కనిపెట్టడం తన వల్ల కాదు..


కారణం ఎటువంటి ex lover కూడా లేడు..


లేని ఒక లవర్ ని వెతికి వెతికి తనకి తెలియకుండానే నా చుట్టూ తిరగడం ప్రారంభించి, తన ex lover కి దూరంగా జరిగాడు..!


తనని పూర్తిగా మరిచిపోయి నాకు సొంతం అయ్యేంత వరకు నాకొక ex lover ఉన్నాడు.!


ఓ నా ఊహా lover ...

నీకు వేల వేల వందనాలు..



Rate this content
Log in

Similar telugu poem from Abstract