నీలోనే
నీలోనే
నీ రాతను మార్చుకునే..బలమున్నది నీలోనే..!
ఏ దైవం ఇవ్వలేని..ధనమున్నది నీలోనే..!
సంకల్పం ఉన్న చాలు..ఎదురుచూపు లేకుండా..
చింతలన్ని కాల్చగల్గు..నిప్పున్నది నీలోనే..!
మంత్రతంత్ర మూలాలను..శోధించే పనేంలేదు..
అతీతమౌ శ్వాసపూల..వనమున్నది నీలోనే..!
రానివ్వకు అలసత్వం..కలనైనా నీ మనసుకు..
పరమాద్భుత జ్ఞానమొసగు..గురువున్నది నీలోనే..!
నీ ఊగిసలాటలకిక..స్వస్థి చెప్పి తీరాలోయ్..
పరబ్రహ్మ తత్వమనే..వెలుగున్నది నీలోనే..!
