ప్రియా నీరదా
ప్రియా నీరదా
శారదా..! ప్రియ నీరదా..!
సకలకళా విశారదా..జననీ..!
సప్తమ చక్ర నివాసినీ..!
మౌనమానస సంచారిణీ..!
వివేక వరదాయినీ..గీర్వాణీ..!
నిజపుస్తక ధారిణీ..!
అగ్నివీణా సంవాదినీ..!
అక్షరగగన విహారిణీ..!
విమలకమల విలాసినీ..!
రక్షాకర కంకణ వాణీ..!
నిత్య లావణ్యరూపిణీ..!
భ్రమావరణ సంహారిణీ..!
సువిజ్ఞాన ప్రసూనవర్షిణీ..!
ఉజ్వలానంద స్వరూపిణీ..!
సకలజగదాధారిణీ..బ్రహ్మణీ..!
