ఊహల పల్లకిలో
ఊహల పల్లకిలో
ఊహాల పల్లకిలో...
ఊరంతా ఊరేగుతావు....
ఆశల అంబరాన్ని...
చేరరమ్మంటావు...
మది ఊయలలో...
హాయిరాగాల ఊగుతావు...
మమతల మారాజులా...
కమ్మని మాటలాడుతావు...
మరి నేనెవరో తెలియని దానిలా...
మట్టిబొమ్మలా మౌనమైపోతావు...
ఇంతటి నిర్దయా...
లేక కాఠిన్యమా...
తెలుపరాదటయ్యా కన్నయ్యా...

