అమ్మగా ఒక బాధ్యత
అమ్మగా ఒక బాధ్యత


ఉదయాన్నే లేవడం
అందరి అవసరాలూ చూసుకుని
ఇంటిని కాపాడే ఇంతినే
పిల్లల కేరింతల్లో
అమ్మ పిలుపు వినే అతివనే
పిల్లల ఏడ్పు విని పరుగెత్తిన రోజులవి
బలం తగ్గిన ఎముకలతో
కర్ర పట్టుకుని నడవాల్సిన రోజులివి
మాతృత్వం ఇచ్చిన బాధ్యతలు
అన్నీ నెరవేర్చాను
తృప్తిగా నిద్రపోవాలని ఉంది
కానీ
మళ్లీ ఏదో ఆశ
ఇంకో బాధ్యత తీసుకోవాలని
చేతనైనంత వరకూ అమ్మగానే ఉండాలని
పిల్లలు పెద్దవాళ్లయ్యారు
కానీ వాళ్ళ పిల్లలకు
కథలు చెప్పే వారు లేరుగా
వీధిలో పిల్లలందరినీ పోగేసాను
రోజుకో కథ చెప్పాలి
అద్భుతమైన కథలు
అమ్మ కథ కూడా చెప్పాలి
మీరూ వింటారా
ఓ మంచి కథ
అమ్మ ప్రేమ పంచే కథ