STORYMIRROR

Swarnalatha yerraballa

Abstract Classics Others

4  

Swarnalatha yerraballa

Abstract Classics Others

జోలాలి

జోలాలి

1 min
351

ఏ లాలి రాగాన్ని నే పాడను కన్నా

యదునందనుని లీలలను పాడనా

యుద్ధభూమిన వివరించిన గీతను పాడనా

ఏ లాలి రాగాన్ని నే పాడను కన్నా

         " ఏ లాలి "


జోలాలి అంటూ నే జోల పాడనా

జీవిత సత్యాలన్నీ జతులుగా స్వరపరచనా

జగతిన దాగిన అందాలన్నీ వివరించనా

జన్మకు అర్థం తెలుసుకోమని చెప్పనా


        "ఏ లాలి "


జాజులను నిదురాలేపగ నవ్విన జాబిలి అందాన్ని ఆలపించిన

జగతి జాగృతికి శ్రీకారం పలికే ప్రభాకరుని ప్రభకు పరవశించమననా

జగన్నాటకానికి సూర్య చంద్రోదయాలు రెండు పాదాలని చెప్పనా

జీవిత నాటకానికి జన్మ మృత్యువులు రెండు తీరాలని చెప్పనా


          "ఏ లాలి "



Rate this content
Log in

Similar telugu poem from Abstract