STORYMIRROR

Swarnalatha yerraballa

Action Inspirational Others

4  

Swarnalatha yerraballa

Action Inspirational Others

సామాన్యుని బ్రతుకు

సామాన్యుని బ్రతుకు

1 min
325

ఎవరికోసం ఈ ఆరాటం

ఎందులకీ పోరాటం

అడగంటిన బ్రతుకుల కోసమా

ఆవిరైనా ఆశల కోసమా

అందలమెక్కాలన్న పాలకుల కోసమా

అందరిలోనూ ఒక్కడైన సామాన్యుడి కోసమా


పరతంత్ర నివాసమన్నాము 

అది సంకెళ్ళతో సావాసమన్నాము 

బానిస బ్రతుకులన్నాము 

బడుగు బ్రతుకులకు బ్రతుకు లేదన్నాము 

పరాయి పాలన లేని ప్రజానీకంలోనూ బానిసలుగానే ఉంటున్నాము

స్వతంత్రమే సంకెళ్ళ ఉచ్చులా బిగిసినా, బంధీ కాదంటున్నాము

పర్లేదని ప్రజాస్వామ్యంలో సౌమ్యంగా నవ్వుతూ బ్రతికేస్తున్నాము

అదే స్వతంత్ర రాజ్యమని సంబరపడదామా ---ఓ సామాన్య మానవుడా 


ఎవరికోసం ఈ ఆరాటం

ఎందులకీ పోరాటం


రాజరికం వద్దన్నాము

రాజ్యాంగం ముద్దన్నాము

నియంత్రుత్వం తగదన్నాము

అది నిరంకుశత్వమన్నాము

ఎన్నికలు కావాలంటూ ఎగిరెగిరి పడ్డాము

ఓటును వ్యాపారం చేసి హక్కును హతమార్చాము

అవినీతికి అండగానిలుస్తూనే నీతి లేక నలుగుతున్నామని గగ్గోలెడుతున్నాము

బాధ్యతారహితుడవైనా సమాజ హితుడవని మురిసిపోదామా --- ఓ సామాన్య మానవుడా 


ఎవరికోసం ఈ ఆరాటం

ఎందులకీ పోరాటం


సమానత్వం సాధించాలంటూ సమావేశాలు పెడతాము

అసమానత్వ లోకమంటూ అల్లకల్లోలం చేస్తాము

కుల ప్రాతిపదికన వర్గాలంటూ వేరు చేస్తున్నాము

ప్రత్యేక కేటాయింపులంటూ సమానత్వానికి సమాధి కడుతున్నాము

ప్రతిభకు పట్టా తప్ప పట్టం కట్టలేకున్నాము 

పవిత్ర భారతావని ప్రగతి పథాన్ని పతనం చేస్తున్నాము

ప్రగతిలేని ప్రజానీకం అని తెలిసినా పోటీ పడుతూనే ఉంటున్నాము

అదే పురోగతి అని గర్వపడుదామా ----ఓ సామాన్య మానవుడా 


ఎవరికోసం ఈ ఆరాటం

ఎందులకీ పోరాటం


Rate this content
Log in

Similar telugu poem from Action