జయహో ఆపరేషన్ సింధూర్
జయహో ఆపరేషన్ సింధూర్
కర్కష ఉగ్రదాడికి
మౌనంకాదు మాసమాధానం,
మతోన్మాదంపై దయను
చూపకపోవడమే నవభారతీయం.
సద్గుణం నేర్వకపోతే
బ్రతుకుఆశ వదులుకోమంటాము,
అజ్ఞానం అసూయ ద్వేషాలే
మీ నేస్తాలైతే
తొలి సంధ్యా సింధూరపు మెరుపుల అగ్నిజ్వాలలతో అణచివేస్తాం,
జాతిని వేదించే క్రీడావినోదాన్ని సహించం
సుడిగాలి కెరటమై
శత్రుబ్రతుకును బుగ్గిచేస్తాం.
రీతితప్పని మా వేదమంత్రం
భారతమాతకు జై అంటూ కదులుతాం,
మానవతా విలువలు మంటకలిపి స్నేహహస్తం చాస్తే
పీకకోసేస్తాం,
భ్రమలు పడకండి
భవితరూపం కానరాని
ఊహల్లో మిమ్ము నిలబెట్టి
మా ధైర్యాన్ని చాటుతాం,
మీ బెదిరింపులకు లొంగిపోక
కుయుక్తుల మీ తలపులను
విప్లవించు గుణములతో
సమాధి కడతాం.
జయహో ఆపరేషన్ సింధూర్
విజయహో భారత వీరజవాన్.
