STORYMIRROR

kamala sri

Drama Inspirational

4  

kamala sri

Drama Inspirational

చదరంగమంటి జీవితం

చదరంగమంటి జీవితం

1 min
404

//చదరంగమంటి జీవితం//


చీకటి మాటున వేదనలు 

వెలుగులో ఆనందాలు 

అప్పుడప్పుడూ సంతోషాలు 

అలకలూ బ్రతిమలాడటాలూ

అన్నింటి కలయికే జీవితం



చదరంగం మంటి జీవితాన్ని 

నడిపించడమే సవాలు ప్రతి మనిషికీ

పావుల్ని కదుపుతూ 

ఎత్తుకు పై ఎత్తులు వేస్తూ 

గెలుపును సంపాదించుకోవడమే జీవితం



ఆటలో గెలుపోటములు సహజం

గెలిచిన నాడు సంతోషించి 

ఓడిన నాడు బాధపడేకన్నా 

ఓటమితో పాఠం నేర్చుకుని 

గెలుపు వైపు సాగిపోవడమే జీవితం



ఓటమి లే చీకట్లై ఆవరించినా 

గెలుపనే వెలుగువైపుగా 

సాగించే అలుపెరుగని 

పయనమే జీవితము 

చీకటి వెలుగుల సమాహారమే 

మానవ జీవితం



... కమల'శ్రీ'✍️.



Rate this content
Log in

Similar telugu poem from Drama