STORYMIRROR

kamala sri

Abstract Inspirational Others

4  

kamala sri

Abstract Inspirational Others

సోషల్ మీడియా భూతం

సోషల్ మీడియా భూతం

1 min
286

శీర్షిక:- సోషల్ మీడియా భూతం

********************


భూతాలు.... 

ప్రాణాలు తీసే భూతాలు...

ఆడవాళ్ల మానాలను 

కాలరాసే కాలయములు...!!!


కళ్లను పీకేస్తాయి

మెడని కొరికేస్తాయి 

గుండెని ఛిద్రం చేస్తాయి

ఆకరికి ఆడవాళ్ల మానాలను హరిస్తాయి...!!!


సోషల్ మీడియాలో 

మొదట అపరిచితులు గా 

పరిచయం అయ్యి 

ఆ పిదప స్నేహితులుగా మారి 

ఆనక మన వ్యక్తిగత విషయాలు 

పంచుకునే ఆత్మబంధువు అయ్యి

ప్రతీ క్షణం చాటింగూ, వీడియో కాల్ లతో

నీ రహస్య సమాచారాన్నీ 

నీ నగ్నచిత్రాలనూ సేకరిస్తుంది...!!!


అప్పుడు చూపిస్తుంది 

దాని నిజ స్వరూపం 

తాము కోరినంత మొత్తం 

ఇవ్వకుంటే రహస్య సమాచారం 

నెట్టింట వైరల్ చేస్తామంటూ 

బెదిరింపులు మొదలెడతారు

ప్రతీ రోజూ నగ్న చిత్రాలను పంపాలి 

లేదంటే నీ పని పడతాం అంటూ సాధిస్తారు...!!!


వారు పెట్టే బాధ భరించలేక 

విషయం బయటపెట్టలేక 

ఎన్నో నిద్ర లేని రాత్రులు గడుపుతూ 

ప్రతీ నిత్యం ఎదురయ్యే నరకాన్ని 

ఎదుర్కోనే ధైర్యం లేక 

ఆఖరికి తమ ప్రాణాలను 

కూడా తీసుకునే సందర్భాలెన్నో...!!!


కావునా.... 

జాగ్రత్త సోదరీ మణులారా 

సోషల్ మీడియాలో 

అపరిచితుల నుంచి వచ్చే 

స్నేహ అభ్యర్థనను అంగీకరించే ముందు 

ఒకటికి పదిసార్లు ఆలోచించు

ఆ అభ్యర్థిన వెనుక 

మీ మాన ప్రాణాలను

హరించే పెనుప్రమాదాలు 

దాగి ఉండవచ్చు

జాగరూకతతో ఉండకపోతే

వారి వలలో చిక్కుకుని 

విలవిల లాడటం ఖాయం

నీ జీవితం నాశనం అవ్వడం తథ్యం

చేజేతులా నీ జీవితాన్ని

నువ్వే నాశనం చేసుకోకు...!!!


             ... కమల'శ్రీ'✍️.


Rate this content
Log in

Similar telugu poem from Abstract