STORYMIRROR

kamala sri

Abstract Others

4  

kamala sri

Abstract Others

ఏం చూస్తున్నావు??

ఏం చూస్తున్నావు??

1 min
344


ఏం చూస్తున్నావు!!! 

ఆమె పైయ్యెదనా?? 

ఓ గుర్తు తెచ్చుకో అవి నీకు ఆకలి తీర్చడానికి 

తన రక్తాన్నే చనుబాలగా మార్చి ఇచ్చిన పాలిండ్లు అవి

ఏం చూస్తున్నావు!!! 

ఆమె నడుమునా ???

నిన్ను ఆ నడుముపై ఎత్తుకుని 

ఊరంతా తిప్పీ తిప్పీ అరిగిపోయిందా నడుము 

ఏం చూస్తున్నావు!!! 

ఆమె నాభినా??? 

ఆ భాగానికి దిగువనే నువ్వు ఈ భూమిపై అడుగు 

పెట్టడానికి డాక్టర్ కత్తితో కోసి నిన్ను పైకి తీసారు!!! 

ఆడదంటే ఏమనుకుంటున్నావు?? 

అంగడి బొమ్మ అనా!! 

ఆమె లో నీ తల్లీ చెల్లీ పిల్లా 

ఎందుకు కనపడటం లేదు మీకు!!! 

నోరు తెరవని పసిపాప నుంచీ 

నోటి లోని పళ్లు రాలిన 

పండు ముసలి అవ్వ వరకూ 

ఎవరినీ విడిచి పెట్టారా !!!

మేమూ మీలాంటి మనుషులమే గా 

మా జీవితాలనెందుకు కాలరాస్తున్నారు 

మీ బుద్ధి ఎటువైపు పోతుంది 

మీ కళ్లలోని కామాన్ని వదిలి 

మమ్మల్ని మీలో ఒకరిగా ఎందుకు చూడరు 

ఓసారి చూడండి మాలో కూడా 

మీ అమ్మా అక్కా చెల్లీ బిడ్డా కనిపిస్తారు 

మా జీవితాలను నలిపాలనే ఆలోచనతో చూసే

మీ కామపు కళ్లకు చెప్పండి మమ్మల్ని వదిలిపెట్టమని 

నీ చూపు మంచిదైతే నీ మనసూ మంచిగా ఉంటుంది 

మేమూ నూరేళ్లు ఈ భూమిపై బ్రతుకుతాం!!! 

                     ....కమల'శ్రీ '✍️🏻.



Rate this content
Log in

Similar telugu poem from Abstract