STORYMIRROR

kamala sri

Abstract Inspirational Others

4  

kamala sri

Abstract Inspirational Others

// ఎన్నికల జాతర//

// ఎన్నికల జాతర//

1 min
286


********************

"ఎన్నికల జాతర"

********************


జాతరో....జాతర....

అంబరాన్నంటే జాతర

దేశమంతటా జరిగే జాతర

ఎన్నికల మోతరా...!!!


ఐదేండ్లకోమారు జరిగే జాతర 

నాయకులను ఎన్నుకునే అతిపెద్ద జాతర

ఎన్నెన్ని వాగ్దానాలో ఇంకెన్ని మలుపులో

ఆశల మేడలు కట్టించే జాతర...!!!


నేనొస్తే నీకు ఇల్లిస్తా 

నేనొస్తే నీకు పైసలిస్తా 

నేనొస్తే నీకు ఫెన్షనిస్తా అంటూ

బూటకపు మాటలు కోకొల్లలు 

వినిపించే జాతర...!!!


తాగినోడికి తాగినంత మందు

అడిగినోడికి అడిగినంత సొమ్ము 

ఇవ్వజూపి కవ్వింపు మాటలతో కైపెంచి

తెరల మాటున జరిగే జగమెరిగిన జాతర...!!!


ఎన్నికలై పోయే

ఫలితాలు బయటికొచ్చే

కనుచూపు మేరలో 

వాగ్ధానం చేసినోడెవడూ 

అడ్డూ అయిపూ లేకుండా

కనుమరుగయ్యే కలల లోకమే ఈ జాతర

ఐదేండ్లకోమారు వచ్చే ఎన్నికల జాతర...!!!


ఏమాత్రం ఏమరుపాటు గా ఉండి

నీ ఓటుని కాసుకి అమ్మేసుకున్నావో

ఐదేళ్లూ వారి చేతిలో కీలుబొమ్మవే 

జర సోచాయించి ఓటేయ్యి...!!!


**************************

కమల'శ్రీ'✍️.



Rate this content
Log in

Similar telugu poem from Abstract