వైద్యం చేయబడును
వైద్యం చేయబడును
రండమ్మా రండి ...
రండమ్మా రండి ...
ఇక్కడ చికిత్స చేయబడును
గాయాలకు కుట్లు వేయబడును
శస్త్ర చికిత్స చేసి నయం చేయబడును
రండమ్మా రండి...
ప్రాణంలా ప్రేమించిన వారు
నీ లోకం తానే అనుకున్న వారు
నీతో కలకాలం బ్రతుకుతానని
నీ తోడూ నీడగా ఉంటానని...
నీ కష్టనష్టాల్లోనూ నీ సాధకబాధకాల్లోనూ
నీతో కలిసి ఉంటాననని పంచ భూతాల సాక్షిగా
అష్ట దిక్పాలకుల సాక్షిగా
నీ చేతిలో చెయ్యేసి
మాటిచ్చిన నీ ప్రేమికులు
చేసిన మోసంతో
తూట్లు పడిన నీ గుండెకి
సాంత్వన అనే చికిత్స చేయబడును
ఓదార్పు అనే మందులు ఈయబడును...
తేనే పూసిన కత్తితో
అయిన గాయాలకూ
చికిత్స చేయబడును
మాటల తూటాలతో
అయిన గాయాలకూ
చికిత్స చేయబడును...
హృదయం రెండు ముక్కలు
అయినా కూడా
దాన్ని ఒక్కటిగా
అతికించేస్తాను...
రండమ్మా...రండి...
రండయ్యా...రండి...
ఇక్కడ గుండె కి
వైద్యం చేయబడును...
